Chandrababu: రాజమండ్రి నుంచి ఒక్క ఐదు నిమిషాలు అటువెళ్లి చూసుంటే హెలికాప్టర్ లోంచి దూకేవాళ్లు: మోదీపై చంద్రబాబు విమర్శలు
- కందుకూరు సభలో చంద్రబాబు ప్రసంగం
- మోదీ నమ్మకద్రోహి
- గట్టిగా అడిగితే ఎదురుదాడి చేస్తున్నాడు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లా కందుకూరు సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూ, ప్రధాని రాష్ట్ర వ్యతిరేకి అని ఆరోపించారు. పోలవరం ప్రాజక్ట్ కు నిధులు ఇవ్వకుండా, అక్కడేమీ పనులు జరగడంలేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల మోదీ రాజమండ్రి వచ్చారని, ఒక్క ఐదు నిమిషాలు పోలవరం వెళ్లి చూసుంటే అక్కడేం జరుగుతుందో మోదీకి తెలిసేదని అన్నారు. అక్కడ జరుగుతున్న పనులు చూస్తే మోదీ అసూయతో హెలికాప్టర్ లోంచి దూకేవాడని ఎద్దేవా చేశారు. మోదీ దుర్మార్గుడైన నాయకుడని, రాక్షసత్వం ఉన్న నాయకుడని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పిన నమ్మక ద్రోహి నరేంద్ర మోదీ అని మండిపడ్డారు.