Telugudesam: టీడీపీ మేనిఫెస్టో హైలైట్స్ ఇవిగో!
- రైతులకు ఉచిత పంటల బీమా
- డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు
- వ్యవసాయ రంగానికి పగటిపూట 12 గంటల నాణ్యమైన విద్యుత్
టీడీపీ అధితనేత చంద్రబాబు ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇవాళ ఉగాది సందర్భంగా పూజలు, పంచాంగశ్రవణం నిర్వహించిన అనంతరం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మేనిఫెస్టో వివరాలు వెల్లడించారు. టీడీపీ మేనిఫెస్టోను 'మీ భవిష్యత్ నా బాధ్యత' పేరుతో రూపొందించారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అనేక ప్రజాసంక్షేమ పథకాలనే నేడు దేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు.
మేనిఫెస్టో ముఖ్యాంశాలు
- ఐదేళ్లపాటూ అన్నదాత సుఖీభవ అమలు.
- రైతులకు రూ.2 లక్షల వరకు వడ్డీలేని రుణాలు.
- రైతు బీమా రూ.10 లక్షలతో పాటు పంటల బీమాను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.
- పగటిపూట 12 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్
- పంటలకు గిట్టుబాటు ధరల కోసం రూ.5000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు
- రాష్ట్రంలో 100 శాతం ప్రకృతిసేద్యానికి ప్రోత్సాహం
- రాష్ట్రాన్ని హార్టీకల్చర్ హబ్ గా ఏర్పాటు
- 40 లక్షల ఎకరాల నుంచి లక్ష ఎకరాలకు పండ్లతోటల పెంపు
- సూక్ష్మనీటిపారుదల కిందికి కోటి ఎకరాలు
- ఫిషరీస్ లో కోల్డ్ చెయిన్ లింక్, ప్రాసెసింగ్ రంగాలకు మరింత దన్ను
- షిప్ ల్యాండింగ్ సెంటర్ల వద్ద మరిన్ని సదుపాయాలు ఏర్పాటు
- తీరప్రాంతాల్లో మత్స్యకారుల కోసం జెట్టీల నిర్మాణం
- ఆవులు, గేదెలకు 75 శాతం రాయితీ
- దాణాపైనా అత్యధిక రాయితీలు
- డ్వాక్రా సంఘాలకు రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు
- ప్రతి డ్వాక్రా మహిళకు స్మార్ట్ ఫోన్
- మహిళా ఉద్యోగుల కోసం ప్రోత్సాహక నిధుల కింద స్కూటర్లు కొనుగోలు
- ఆశా, అంగన్ వాడీ కార్యకర్తల కోసం అనేక సదుపాయాలు
- పెన్షన్లు రూ.3000కి పెంపు
- వయోపరిమితి 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గింపు
- చంద్రన్న బీమా 10 లక్షలకు పెంపు
- పెళ్లి కానుక లక్ష రూపాయల పెంపు
- 20,000 జనాభా దాటిన అన్ని మేజర్ పంచాయతీల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటు
- పేద కుటుంబాలకు పండుగ వేళల్లో 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేత
- ఎస్సీ, ఎస్టీల కోసం పదేళ్ల పాటు ఉప ప్రణాళిక అమలు
- 100 గురుకుల పాఠశాలల స్థాపన
- ఎస్టీల కోసం ప్రత్యేకంగా 50 రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీలు అన్ని వర్గాల వారికి విదేశీ విద్య కోసం రూ.25 లక్షలు
- ఆదివాసీల కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు
- ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ
- త్వరలోనే అంబేద్కర్ స్మృతివనం, జగజ్జీవన్ రామ్ స్మృతివనం పూర్తి
- మాదిగల కోసం ప్రత్యేక కార్పొరేషన్ స్థాపన
- లిడ్ క్యాప్ తో సంబంధం లేకుండా మాదిగ కార్పొరేషన్ కు ప్రత్యేక నిధులు
- ఐటీడీఏ పరిధిలో యానాదులకు ప్రత్యేకంగా కార్పొరేషన్
- వెనుకబడిన వర్గాల కోసం రూ.10,000 కోట్లతో బీసీ డెవలప్ మెంట్ బ్యాంక్
- బీసీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత
- ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో 25 శాతం ప్లాట్లు బీసీల పరం
- బీసీలు స్వయం ఉపాధిలో భాగంగా ఇన్నోవా తరహా కార్ల కొనుగోలులో 25 శాతం రాయితీ
- బీసీ విద్యార్థుల కోసం 200 రెసిడెన్షియల్ స్కూళ్లు
- బీసీ మత్స్యకారుల క్రాప్ హాలీడే పరిహారం రూ.4000 నుంచి రూ.10,000కి పెంపు
- మత్స్యకారుల డీజిల్ కొనుగోలులో లీటర్ పై రూ.10 రూపాయల వరకు ఇన్సెంటివ్ పెంపు
- బోయ, వాల్మీకి, వడ్డెర, రజక కులాలను ఎస్టీల్లో చేర్చాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు
- వర్గీకరణలో ఉన్న కులాలకు న్యాయం జరిగేలా చర్యలు
- ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రాధాన్యత దక్కని వడ్డెర, బ్రాహ్మణ వర్గాలకు ఎమ్మెల్సీ పదవులు
- చేనేత కార్మికులకు ఉచిత ఆరోగ్య బీమా
- మార్కెటింగ్ నిధుల కింద రూ.250 కోట్లు
- మంగళగిరిలో చేనేత సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కింద అన్నిరకాల అభివృద్ధి చర్యలు
- చేనేత కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు
- కాపులకు 5 శాతం రిజర్వేషన్ల కొనసాగింపు
- అర్చకులు, ఇమామ్ ల వేతనాలు పెంపు కొనసాగింపు
- మైనారిటీ యువకులు ఆటోలు, ఎలక్ట్రిక్ ఆటోరిక్షాల కొనుగోలు కోసం 50 శాతం రాయితీ
- బ్యాంకులతో సంబంధం లేకుండా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.25,000 ఆర్థికసాయం
- ట్రిపుల్ తలాక్, 4 శాతం రిజర్వేషన్లపై రాజీలేని పోరాటం
- ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు, వడ్డీలేని రుణాలు అందజేత
- క్రిసియన్లకు ప్రతి జిల్లాలో ఒక క్రైస్తవ భవన్ నిర్మాణం
- క్రైస్తవుల విదేశీ విద్యకు సహకారం
- క్రైస్తవులకు శ్మశానాల కోసం భూములు ఇప్పించడం
- ఇమామ్ లు, అర్చకులతో పాటు పాస్టర్లకు కూడా ఉచిత నివాస గృహాల కల్పనలో అత్యధిక ప్రాధాన్యం
- దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్ల స్థానంలో మోటారైజ్డ్ మూడు చక్రాల వాహనాలు అందజేత
- దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం రూ.50,000 కోట్లతో మూలధనం ఏర్పాటు
- మానసిక వికలాంగులకు పరిస్థితిని బట్టి రూ.3000 పింఛను
- యువతకు యువనేస్తం కింద భృతి రూ.2000 నుంచి రూ.3000 పెంపు
- ఇంటర్ పాస్ అయితే నిరుద్యోగ భృతి
- ఇంటర్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు
- యువతకు రూ.10 లక్షల్లోపు పెట్టుబడి ఉంటే వడ్డీలేని రుణాలు
- రూ.100 కోట్లతో ఇన్నోవేటివ్ ఫండ్ ఏర్పాటు
- ప్రధాన పట్టణాల్లో ఇన్నోవేటివ్ హబ్ ల స్థాపన
- గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి 70 లీటర్ల మంచినీరు అందజేత
- సిమెంట్ రోడ్ల నిర్మాణంపై దృష్టి
- 2000 జనాభా ఉన్న ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు
- గ్రామాల నుంచి మెయిన్ రోడ్ వరకు బీటీ రోడ్లు
- రద్దీ ఉన్న ప్రాంతాల్లో రెండు లేన్ల నుంచి ఆరు లేన్ల వరకు రోడ్ల నిర్మాణం
- పట్టణ ప్రాంతాల్లో తోపుడు బండ్లు వాళ్లపై వేధింపుల నివారణకు చర్యలు
- పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల పెంపు
- పట్టణాల్లో అన్న క్యాంటీన్ల సంఖ్య పెంపు
- మెగా టెక్స్ టైల్ పార్కుల్లో 3 లక్షల మంది ఉపాధి కల్పన
- కడప జిల్లా ఓర్వకల్లులో ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు కృషి
- ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్ షిప్ అభివృద్ధి
- విజయనగరం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మెగా ఫుడ్ పార్కులు
- కడప, చిత్తూరు జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు
- తిరుపతిలో భారీ ఎలక్ట్రానిక్ క్లస్టర్లు
- విశాఖపట్నంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ స్థాపన