: బస్ పాస్ ధరలు తగ్గించాలి
పెంచిన బస్ పాస్ ధరలను తక్షణం తగ్గించాలంటూ ఆర్టీసీ బస్ భవన్ ఎదుట తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. బస్ పాస్ ధరలు పెంచడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరో వైపు పెరిగిన ఛార్జీలను ఉపసంహరించాలంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పీసీసీ ఛీఫ్, రవాణాశాఖా మంత్రి బొత్సను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆర్టీసీ ఆదాయం సమకూర్చుకునేందుకు విద్యార్థులపై భారం వెయ్యడం తగదని విన్నవించారు. బస్ పాస్ ధరలను తగ్గించకుంటే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు.