Chandrababu: ఓవైపు తాను హెచ్చరిస్తుండగానే స్పైడర్ మ్యాన్ లా పైకి ఎగబాకిన వ్యక్తి... చూసి నవ్వుకున్న చంద్రబాబు
- ఆలూరు సభలో ఘటన
- పైకి ఎక్కిన వారిని దిగమన్న చంద్రబాబు
- ససేమిరా అన్న 'తమ్ముళ్లు'!
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన సభలో పలుసార్లు చమత్కారాలతో సభికులను నవ్వించారు. డ్వాక్రా మహిళలు, రైతులు, నిరుద్యోగులకు తాను చేస్తున్న సాయం గురించి చెబుతుండగా, కొందరు అభిమానులు కమ్మీలు పట్టుకుని పైకి ఎక్కి కూర్చోవడం చూసి వారించే ప్రయత్నం చేశారు. "తమ్ముళ్లూ దిగేయాలమ్మా, దిగకపోతే పడతారు! మీరు పడితే నాకు బాధ. దిగాలీ, తమ్ముళ్లూ గారాబం వద్దు, దిగాలి! మీరు పడతారు తమ్ముడూ దిగండీ! ఓకే, వాళ్లక్కడే ఉంటామంటున్నారు" అంటూ చంద్రబాబు తన ప్రసంగం కొనసాగించే ప్రయత్నం చేశారు. ఓవైపు ఆయన కొందరిని హెచ్చరిస్తుండగానే, చంద్రబాబు పక్కనే ఉన్న గ్యాలరీలోంచి ఓ వ్యక్తి స్పైడర్ మ్యాన్ లా పైకి ఎగబాకడం కనిపించింది. చంద్రబాబు కూడా ఇదంతా చూసి నవ్వుకున్నారు.