bellamkonda: 'రాక్షసుడు' గా బెల్లంకొండ శ్రీనివాస్?

  • తమిళంలో సక్సెస్ అయిన 'రాచ్చసన్'
  • రమేశ్ వర్మ దర్శకత్వంలో రీమేక్ 
  • టైటిల్ విషయంలో కసరత్తు

రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. తమిళంలో క్రితం ఏడాది హిట్ కొట్టిన 'రాచ్చసన్' సినిమాకి ఇది రీమేక్. తమిళంలో విష్ణు విశాల్ .. అమలా పాల్ జంటగా నటించిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా రీమేక్ కి నిర్మాతగా కోనేరు సత్యనారాయణ వ్యవహరిస్తూ ఉండగా, చకచకా షూటింగు జరుపుకుంటోంది.

ఈ సినిమాకి తెలుగులో 'రాక్షసుడు' అనే టైటిల్ ను ఖరారు చేయాలనే ఆలోచనలో రమేశ్ వర్మ వున్నాడు. గతంలో చిరంజీవి హీరోగా 'రాక్షసుడు' వచ్చింది. ఆ మధ్య సూర్య అనువాద చిత్రం కూడా 'రాక్షసుడు' టైటిల్ తో తెలుగులోకి వచ్చింది. మళ్లీ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకి అదే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే .. ఈ టైటిల్ ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రంగా ఈ నెలలో 'సీత' సినిమా రానున్న సంగతి తెలిసిందే.

More Telugu News