Chandrababu: మళ్లీ చంద్రబాబే సీఎం: శ్రీరాజరాజేశ్వరి జ్యోతిషాలయ వ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్యస్వామి
- టీడీపీకి 120 నుంచి 130 సీట్లు
- వైసీపీకి 35 నుంచి 45 సీట్లు
- జనసేనకు 10 నుంచి 15 సీట్లు
ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని... చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపడతారని శ్రీరాజరాజేశ్వరి జ్యోతిషాలయ వ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్యస్వామి జోస్యం చెప్పారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ, ఏపీలో 120 నుంచి 130 అసెంబ్లీ సీట్లను టీడీపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. చంద్రబాబు జాతకరీత్యా సప్తమ స్థానంలో గురువు బలం బ్రహ్మాండంగా ఉందని చెప్పారు.
వైసీపీ అధినేత జగన్ జాతకరీత్యా జన్మస్థానంలో రాహువు ఉన్నాడని... దీంతో, ఆయన గ్రహబలం బాగోలేదని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. వైసీపీ కేవలం 35 నుంచి 45 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గ్రహబలం కూడా కొంచెం మెరుగ్గానే ఉందని... జనసేన పార్టీకి 10 నుంచి 15 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2011లో తమిళనాడులో జయలలిత అధికారంలోకి వస్తారని... 2014 ఎన్నికల్లో ప్రధానిగా మోదీ, సీఎంగా చంద్రబాబు అవుతారని తాను చెప్పానని... తాను చెప్పినట్టే జరిగిందని అన్నారు.