: నేడు హస్తినకు సీఎం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేటి సాయంత్రం ఢిల్లీ వెళ్ళనున్నారు. ప్రభుత్వ పనితీరు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై అధిష్ఠానంతో చర్చించేందుకు సీఎం వెళ్ళనున్నారన్నది పార్టీ సమాచారం. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో హస్తిన టూర్ ఆసక్తి రేపుతోంది. మొన్న మంత్రి రఘువీరా రెడ్డి మేడంను కలిసి గుంభనంగా వెళ్ళిపోవడం, సీఎంకు, మంత్రికి కొన్ని అంశాల్లో పొసగడం లేదన్న వార్తల నేపధ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేకిత్తిస్తోంది.