YSRCP: హిందూపురం లోక్ సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు పితృవియోగం
- అనారోగ్యంతో మృతి చెందిన మాధవ్ తండ్రి
- రుద్రవరంలో అంత్యక్రియలు
- సంతాపం తెలిపిన వైసీపీ నాయకత్వం
కొన్నాళ్లక్రితం జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలేసి సంచలనం రేపిన పోలీస్ అధికారిగా గోరంట్ల మాధవ్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ వీరోచిత చర్య కారణంగా ఆయనకు రాజకీయ వర్గాల్లో కూడా ఇమేజ్ వచ్చింది. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరడం, హిందూపురం లోక్ సభ అభ్యర్థిగా పోటీచేయడం అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఎన్నికల ముంగిట గోరంట్ల మాధవ్ నివాసంలో విషాదం చోటుచేసుకుంది. మాధవ్ తండ్రి కురుబస్వామి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. తండ్రి మరణవార్త తెలియడంతో ప్రచారంలో ఉన్న గోరంట్ల మాధవ్ వెంటనే ప్రచారం నిలిపివేసి స్వగ్రామానికి పయనం అయ్యారు. కర్నూలు జిల్లా రుద్రవరంలో మాధవ్ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమ పార్టీ అభ్యర్థికి పితృవియోగం కలగడం పట్ల వైసీపీ అధినాయకత్వం సంతాపం తెలియజేసింది.