: ఐఐఎంలో సీటు సంపాదించిన పేపర్ బోయ్


కృషితో నాస్తి దుర్భిక్షం అని పెద్దలు ఏనాడో చెప్పారు. బెంగళూరు విద్యార్థి శివకుమార్ కు ఇది అతికినట్లు సరిపోతుంది. కటిక పేద కుటుంబంలో పుట్టినా, ఇంటింటికీ పేపర్లు వేస్తూ కష్టపడి చదువుకుని ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ కలకత్తాలో సీటు సంపాదించాడు. వచ్చే జూన్ 16న పిజిపి కోర్సులో అడుగుపెట్టనున్నాడు.

శివ తండ్రి ట్రక్ డ్రైవర్. తలకు మించిన అప్పులు. ఇల్లు గడిచేది కాదు. ఇది చూసిన శివ 6వ తరగతిలోనే ఇంటింటికీ పేపర్లు వేసే పనిలో కుదిరాడు. అలా నెలకు వచ్చే 150 రూపాయలు వారి కుటుంబానికి ఎంతో కొంత తోడ్పాటునందించేవి. అలా కష్టపడి సంపాదిస్తూ, కష్టపడి చదువుతూ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేశాడు. క్యాట్ రాసి ఐఐఎమ్ కలకత్తాలో సీటు సంపాదించాడు. శివ పట్టుదల ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది.

  • Loading...

More Telugu News