dhanaraj: ఇకపై సినిమాలు నిర్మించనని భార్యకి ధనరాజ్ మాటిచ్చాడట!

  • సినిమాలంటే పిచ్చి 
  • తెరపై కనిపించాలనే ఆసక్తి
  •  నిర్మాతగా నష్టాలు  

చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన ధనరాజ్ కి .. మొదటి నుంచి కూడా సినిమా పిచ్చి ఉందట. ఎలాగైనా సినిమా తెరపై కనిపించాలనే పట్టుదలతోనే ఆయన హైదరాబాద్ వచ్చేశాడట. 'జై' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ధనరాజ్, ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ వెళ్లాడు. ఒక వైపున సినిమాల్లో కమెడియన్ గా కనిపిస్తూనే, మరో వైపున 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఆయన మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక కొంతమంది కమెడియన్స్ మాదిరిగానే ఆయన కూడా హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుందామని చెప్పేసి .. అందుకోసం ఒక సినిమా నిర్మాణంలో భాగస్వామిగా మారాడు. ఆ సినిమా ఆడకపోవడంతో, ఆయన భారీమొత్తమే నష్టపోయాడట. దాంతో ఇకపై సినిమాలు నిర్మించనని భార్యకు మాటిచ్చేశాడట. పూర్తిగా నటన పైనే దృష్టి పెట్టి .. తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళుతున్నాడు.

  • Loading...

More Telugu News