Chandrababu: బాబాయ్ కూతుర్ని జగన్ బెదిరిస్తున్నాడు: చంద్రబాబు ఆరోపణ
- వివేకా హత్యను రాజకీయంగా వాడుకుంటున్నారు
- అందులో భాగమే సోదరితో ఆరోపణలు
- జగన్ చెప్పిందే ఆమె మాట్లాడుతున్నట్టుంది
బాబాయ్ హత్యను రాజకీయంగా వాడుకుని ప్రయోజనం పొందాలని చూస్తున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇందుకోసం సోదరి డాక్టర్ సునీతారెడ్డిని బెదిరించి మాట్లాడిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇందుకోసం సొంత బాబాయి కూతురికి కూడా ప్రాణభయం కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ బెదిరింపులు వల్లే డాక్టర్ సునీత అన్న జగన్ చెప్పినట్టే మాట్లాడుతోందని, ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.