Jagan: జగన్‌కు మోదీతో ఉన్న రహస్య సంబంధాన్ని బయట పెట్టాలి: కళా వెంకట్రావు

  • మోదీతో బంధం ఎంత గట్టిదో తెలుస్తోంది
  • కేసీఆర్‌తో ఉన్న ముసుగును తొలగించిన జగన్
  • వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ

ముగ్గురు ఐపీఎస్‌లను కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగమేఘాల మీద బదిలీ చేసిందంటే జగన్‌కు మోదీతో ఉన్న బంధం ఎంత గట్టిదో అర్థమవుతుందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. నేడు ఆయన జగన్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు.

ఇప్పటికే కేసీఆర్‌తో ఉన్న ముసుగును తొలగించిన జగన్, మోదీతో ఉన్న రహస్య సంబంధాన్ని బయటపెట్టి మరో ముసుగును కూడా తొలగించాలని కోరారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ అనవసరమని జగన్ బాబాయి ప్రతాపరెడ్డి చెప్పలేదా? అని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా పనిచేస్తున్న పోలీసు అధికారులపై బదిలీ వేటు వేయాలని లేఖ రాయడం సిగ్గు చేటని కళా లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News