BJP: ఏపీ బీజేపీ మేనిఫెస్టో విడుదల... రైతులకు ఒకేసారి రుణమాఫీ!
- చేనేత కార్మికుల రుణాలు మాఫీ
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు
- 60 ఏళ్లు నిండినవారికి రూ.3000 పింఛను
ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మా రాష్ట్రంలో కూడా పనిచేస్తుందని నమ్ముతున్న రాష్ట్ర బీజేపీ శాఖ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. చేనేత కార్మికుల రుణాల మాఫీ, హోంగార్డులకు నెలకు రూ.20 వేల వేతం, 60 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.3000 పింఛను బీజేపీ మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు. అంతేగాకుండా సామాజిక సమానత్వం అంశాన్ని కూడా కాషాయదళం తన మేనిఫెస్టోలో చేర్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలనే కాకుండా బీసీ సామాజిక వర్గాలను కూడా వర్గీకరణ చేస్తామని వివరించారు. అంతేగాకుండా, ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చుతామని పేర్కొంది.
ఏపీ బీజేపీ మేనిఫెస్టో హైలైట్స్
- హిందూ మత పరిరక్షణ కోసం చర్యలు
- దశలవారీగా మద్యపాన నిషేధం
- చేనేత కార్మికుల రుణాల మాఫీ
- డిగ్రీ విద్యార్థినులకు 90 శాతం సబ్సీడీపై స్కూటీల పంపిణీ
- డిగ్రీ, పీజీ స్టూడెంట్లకు ఉచిత ల్యాప్ టాప్ లు
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు
- హోంగార్డులకు నెలకు రూ.20 వేల వేతనం
- 60 ఏళ్లు నిండినవారికి రూ.3000 పింఛను
- ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటింపు
- ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ వర్గీకరణ
- ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు
- రైతులకు ఒకేసారి రుణ మాఫీ
- వ్యవసాయ రంగానికి 16 గంటల నాణ్యమైన విద్యుత్
- సన్నకారు, కౌలు రైతుల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లింపు
- సాగునీటి ప్రాజక్టుల నిర్మాణం, ఆధునికీకరణ
- ఇండస్ట్రియల్ హబ్ గా రాయలసీమ అభివృద్ధికి చర్యలు