India: తగినన్ని ఉద్యోగాలు లేకుండా 7 శాతం వృద్ధిరేటు ఎలా సాధ్యం?: విస్మయం వ్యక్తం చేసిన రఘురామ్ రాజన్

  • సమాచారం నమ్మశక్యంగా లేదు
  • సందేహాలు వ్యక్తం చేసిన ఆర్బీఐ మాజీ గవర్నర్
  • స్వతంత్ర సంస్థతో అంచనా వేయించాలంటూ సూచన

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ జాతీయ వృద్ధి రేటు 7 శాతంగా ప్రచారం జరగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశంలో తగినన్ని ఉద్యోగాల కల్పన లేకుండానే ఈ స్థాయిలో వృద్ధిరేటు నమోదు కావడం నమ్మశక్యంగా అనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. ప్రచారంలో ఉన్న జీడీపీ సమాచారంపై అనుమానాలు కలుగుతున్నాయని, ఓ స్వతంత్ర సంస్థతో దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయించాలని ఆయన సూచించారు.

 ఏ గణాంకాల ఆధారంగా ఏడు శాతం వృద్ధి రేటు అంచనా వేశారో తెలియడంలేదని, అయితే భారత్ నిజమైన వృద్ధిరేటు ఎంతో తెలుసుకోవాలంటే నికార్సయిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. రఘురామ్ రాజన్ తాను రచించిన 'ది థర్డ్ పిల్లర్' అనే పుస్తకం ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News