Chandrababu: కులం చూశానా? మతం చూశానా? డబ్బులు పోయినా సంపాదిస్తా, మిమ్మల్ని అవమానిస్తే భరించలేను: చంద్రబాబు ఎమోషనల్ వ్యాఖ్యలు
- కులం తిండిపెట్టిందా?
- కులం న్యాయం చేసిందా?
- సూళ్లూరుపేట సభలో సీఎం ప్రసంగం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లాలో ప్రచారం ముగించుకుని నెల్లూరు జిల్లాలో ప్రవేశించారు. ఇవాళ మధ్యాహ్నం సత్యవేడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అక్కడినుంచి సూళ్లూరుపేట చేరుకుని భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనకు కులమత భేదాల్లేవన్నారు.
"కులం మీకు తిండిపెట్టిందా? కులం మీకు న్యాయం చేసిందా? నేను ఎప్పుడైనా కులాన్ని చూశానా? మతాన్ని చూశానా? పేదవాడు ఎక్కడున్నా పేదవాడే! ఆ పేదవాడికి సేవ చేయడమే నా కర్తవ్యంగా భావిస్తాను. రేపటి ఎన్నికల్లో ఓటమిపాలైతే మాత్రం పాతాళానికి దిగజారుతాం. రాష్ట్రం మరో బీహార్ లా తయారవుతుంది" అని హెచ్చరించారు. అంతేగాకుండా, జగన్ అధికారంలోకి వస్తే కేసీఆర్ రిమోట్ కంట్రోల్ తో పరిపాలిస్తాడని అన్నారు. డబ్బులు పోయినా నేను సంపాదిస్తాను, కానీ మిమ్మల్ని అవమానిస్తే మాత్రం నేను భరించలేను అంటూ చంద్రబాబు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.