: వెలుగులోకి వచ్చిన 'ఐన్‌స్టీన్ గ్రహం'!
అనంతమైన విశ్వం ఆశ్చర్యాలకు నిలయం. అలాంటి ఈ విశ్వంలో కొత్తగా ఒక గ్రహాన్ని కనుగొన్నారు. ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా కనుగొన్న ఈ గ్రహానికి ఐన్‌స్టీన్ గ్రహం అనే ముద్దుపేరు పెట్టారు ఖగోళశాస్త్రవేత్తలు. సౌరకుటుంబం వెలుపల ఇప్పటికే కనుగొన్న దాదాపు 800 గ్రహాల్లో ఇది తాజా గ్రహం. అయితే ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా గ్రహాన్ని కనుగొనడం ఇదే తొలిసారి. ఈ గ్రహానికి కెఫ్లర్ 76బి అనే పేరు పెట్టారు. ఇది గురుగ్రహానికన్నా 25 శాతం పెద్దది, దానికన్నా రెండు రెట్లు బరువైంది. ఇది ఉష్ణ గురుగ్రహం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు