YSRCP: వైసీపీకి మిగిలేది అదే, మీకు ఇంక చరిత్ర ఉండదు: సీఎం చంద్రబాబు
- వైసీపీని గెలిపించాలని కేసీఆర్ చూస్తున్నారు
- ఆ పార్టీకి వెయ్యి కోట్ల రూపాయలు పంపారు
- అవి మిగుల్చుకోండంటూ బాబు సెటైర్లు
ఏపీలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేయని ప్రయత్నం అంటూ లేదని, ఓటర్లకు డబ్బు పంచేందుకు వెయ్యి కోట్ల రూపాయలను వైసీపీకి పంపారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. కడప జిల్లా రాయచోటిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ‘కేసీఆర్ వెయ్యికోట్లు పంపించారు. అవి మిగుల్చుకోండి మీరు. అదే మిగిలేది మీకు. ఇంక చరిత్ర ఉండదు మీకు, చరిత్ర హీనులుగా మిగిలిపోయారు’ అని అన్నారు.
తెలంగాణలో కేసీఆర్ అన్ని పార్టీలను కొనేశారని, ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బలహీనం చేశారని విమర్శించారు. బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి హైదరాబాద్ ని తెలంగాణకు ఇస్తే, తమపైనే కక్ష గడతారా? అని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ‘మా జోలికి వస్తే ఖబడ్దార్’ అని చంద్రబాబు హెచ్చరించారు.