Chandrababu: మనమధ్య ఎవరూ వద్దు... ఓపెన్ గా నువ్వే రా, తేల్చుకుందాం!: చంద్రబాబుకు సవాల్ విసిరిన మోహన్ బాబు
- కక్షసాధింపు చర్యలు చేపట్టాడు
- ఇద్దరు జోకర్లతో చెప్పిస్తున్నాడు
- పదవిలో ఉన్నంత మాత్రాన గొప్పవాడివా!
ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో సీనియర్ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు తన పట్టు విడవడంలేదు. తాజాగా ట్విట్టర్ లో సీఎం చంద్రబాబును పరోక్షంగా ఉద్దేశిస్తూ బహిరంగ లేఖను పోస్టు చేశారు. ఎక్కడా చంద్రబాబు పేరును ప్రస్తావించకుండానే మోహన్ బాబు తన లేఖలో తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ అడిగితే కక్షసాధింపు మొదలుపెట్టాడని, ఆ గ్రేట్ అబద్ధాల కోరు గురించి చెప్పాలంటే ఒక గ్రంథం తయారవుతుందని పేర్కొన్నారు. 2013లో అధికారంలో లేకపోయినా అతడిని ఎంతో గౌరవించి తన విద్యాసంస్థల్లో నిర్వహించిన ప్రతి కార్యక్రమానికి పిలిచానని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక గొప్పవాడ్ని అనుకుంటున్నాడని, ప్రజలిచ్చిన అధికారంతో గొప్ప అనుకుంటే ఎలా? అంటూ విమర్శించారు.
ప్రభుత్వం నీది కాబట్టి కొందరు జోకర్లు రంగప్రవేశం చేసి మాట్లాడుతుంటారని, వాళ్లెవరూ కాకుండా డైరక్ట్ గా నువ్వే వచ్చేయ్, ఓపెన్ గా తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. అంతేకాదు, తన లేఖలో అనేక వివాదాస్పద అంశాలను కూడా మోహన్ బాబు స్పృశించారు.
లేఖ పూర్తి పాఠం