Tollywood: జైపూర్ లో హీరో వెంకటేశ్ కుమార్తె పెళ్లిసందడి

  • ఘనంగా ముందస్తు వేడుకలు
  • హాజరైన సల్మాన్ ఖాన్
  • సందడి చేసిన రానా, చైతూ, సమంత 

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ పెద్ద కుమార్తె అశ్రిత వివాహం రాజస్థాన్ లోని జైపూర్ వేదికగా జరగనుంది. ఆదివారం వివాహం జరగనుండగా, శుక్రవారం రాత్రి వివాహ ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దగ్గుబాటి కుటుంబీకులతో పాటు బంధుమిత్రులు, సినీ ప్రముఖులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

 వెంకటేశ్ కుమార్తె అశ్రిత, హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో పెళ్లితో ఒక్కటవుతున్నారు. జైపూర్ లోని ఓ స్టార్ హోటల్ అశ్రిత, వినాయక్ రెడ్డిల పెళ్లికి వేదికగా నిలుస్తోంది. కాగా, ఈ పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. రానా దగ్గుబాటి, నాగచైతన్య, సమంత తదితరులు కూడా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేశారు.

  • Loading...

More Telugu News