Jagan: కడప జిల్లాలో గెలవలేమని టీడీపీ నిర్ణయించుకుంది: జగన్
- టీడీపీకి డిపాజిట్లు కూడా రావు
- అందుకే కుట్రలకు తెరలేపారు
- జగన్ ఆరోపణలు
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పులివెందులలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి కనిపిస్తోందని, కడప జిల్లాలో గెలవలేమని టీడీపీ గుర్తించిందని అన్నారు. అందుకే కుట్రలకు తెరలేపారని, మూడు రోజుల్లో రాష్ట్రంలో దహనాలకు సిద్ధం కావాలని చంద్రబాబు టీడీపీ శ్రేణులను ఆదేశించారంటూ జగన్ ఆరోపించారు. వైసీపీలో పెద్ద నాయకులు లేకుండా చేసేందుకు అరెస్టులకు తెరలేపుతారని, ఎవరూ సంయమనం కోల్పోవద్దని పిలుపునిచ్చారు. చంద్రబాబు అన్యాయంగా కేసులు పెట్టినా సహనం పాటించాలని జగన్ సూచించారు. చంద్రబాబు కాంగ్రెస్ తో కుమ్మక్కైన ఫలితమే తనపై కేసులని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు తన పార్ట్ నర్ (పవన్ కల్యాణ్!) తో స్క్రిప్ట్ చదివి వినిపిస్తున్నారని జగన్ విమర్శించారు. వైసీపీ ఓట్లను చీల్చేందుకు చంద్రబాబు ఆడే నాటకాలు అన్నీఇన్నీ కావని అన్నారు.