Telangana: తెలంగాణ పోలీసు నియామకాల్లో కన్సల్టెన్సీ ఉద్యోగి మాయాజాలం

  • అనర్హుల పేర్లు అర్హుల జాబితాలోకి ఎక్కించే ప్రయత్నం
  • గుర్తించిన ఉన్నతాధికారులు
  • నిందితుడి అరెస్ట్

తెలంగాణ రాష్ట్రం భారీ స్థాయిలో ప్రకటించిన పోలీసు నియామకాల ప్రక్రియలో అక్రమాలు వెలుగుచూశాయి. పోలీస్ రిక్రూట్ మెంట్ లో పాలుపంచుకుంటున్న ఈ-సాఫ్ట్ అనే కన్సల్టెన్సీ సంస్థ అభ్యర్థుల ఫిజికల్ స్డాండర్డ్స్ తో పాటు రన్నింగ్, హైజంప్, లాంగ్ జంప్ ఈవెంట్ల వివరాలను నిక్షిప్తం చేస్తుంది. ఈ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న బానోత్ నాగు అక్రమాలకు తెరలేపాడు.

ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించని వాళ్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి వారి పేర్లను అర్హుల జాబితాలో చేర్చేందుకు ప్రయత్నించాడు. అంతర్గత తనిఖీల్లో ఈ విషయం బట్టబయలైంది. తన బంధువు అయిన బూక్యా రమేష్ అనే వ్యక్తి సాయంతో బానోత్ నాగు పోలీసు ఉద్యోగార్థుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. అయితే ఈ విషయం మొదట్లోనే గుర్తించడంతో అర్హులకు న్యాయం జరిగినట్టయింది. పోలీసు అధికారుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News