sangareddy: నన్ను టీఆర్ఎస్ లోకి తీసుకోరు: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  • టీఆర్ఎస్ పార్టీలో చేరమని నన్నెవరూ పిలవలేదు
  • అయినా, నేను చెప్పిన మాట వినను 
  • అది టీఆర్ఎస్ కు ఇష్టముండదు

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ పార్టీ మారుతున్నారని, టీఆర్ఎస్ లోకి వెళుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీలో చేరమని తనను ఎవరూ పిలవలేదని స్పష్టం చేశారు. అయినా, తనను ఆ పార్టీలోకి తీసుకోరని, చెప్పిన మాట వినను కదా, అది టీఆర్ఎస్ కు ఇష్టముండదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీ-కాంగ్రెస్ ను ఆ పార్టీ నేతలు వీడుతున్న అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ, తమ పార్టీలో ఎవరున్నా, పోయినా భవిష్యత్ మాత్రం కాంగ్రెస్ దేనని, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News