nithin: రమేశ్ వర్మతో నితిన్ సినిమా ఖాయమైపోయింది

  • వెంకీ కుడుములతో 'బీష్మ'
  • రమేశ్ వర్మతో లవ్ స్టోరీ 
  • ఆగస్టులో షూటింగు మొదలు

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ 'భీష్మ' చిత్రం చేయవలసి వుంది. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లవలసిన ఈ సినిమా, కొన్ని కారణాల వలన ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలోనే రమేశ్ వర్మ దర్శకత్వంలోను నితిన్ ఒక సినిమా చేయనున్నాడనే వార్త కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 'హోలీ' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, తాజాగా ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు.

కోనేరు సత్యనారాయణ .. హవీశ్ లక్ష్మణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. అందమైన ఈ ప్రేమకథా చిత్రానికి నటరాజన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నాడు. ఆగస్టు నెలలో ఈ సినిమా షూటింగు మొదలుకానుంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

More Telugu News