: మహాకుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
అలహాబాద్ మహాకుంభమేళాకు రాష్ట్రం నుంచి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాకినాడ -అలహాబాద్, సికింద్రాబాద్ - కాకినాడల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఫిబ్రవరి 19 ఉదయం 6:45 గంటలకు కాకినాడ నుంచి అలహాబాద్ కు, ఫిబ్రవరి 20 సాయంత్రం 6:40 గంటలకు అలహాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అలాగే ఫిబ్రవరి 17 రాత్రి 9:40 గంటలకు సికింద్రాబాద్ నుంచి కాకినాడకు, ఫిబ్రవరి 22 రాత్రి 8:55 గంటలకు కాకినాడ నుంచి సికింద్రాబాదుకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

మరోవైపు మహాకుంభమేళాకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ నుంచి ప్రత్యేక రైలును తూర్పు రైల్వే శాఖ పొడిగించింది. విశాఖపట్నం నుంచి అహ్మాదాబాద్ వెళ్లే ఈ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 28న, అలాగే మార్చి 7వ తేదీన ఉదయం 9:30కి విశాఖపట్నం నుంచి బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.