Andhra Pradesh: ఎల్లుండి రాజకీయ పార్టీలతో సమావేశం కానున్న ఏపీ ఎన్నికల అధికారి ద్వివేది
- పార్టీలు సహకరించాలి
- రేపు కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్
- ఎన్నికల అధికారి ద్వివేది వెల్లడి
ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో భద్రత పర్యవేక్షణ కోసం 66 మంది ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి పంపిస్తోందని ద్వివేది మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ పై మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా బుధవారం రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమకు సహకరించాలని ద్వివేది కోరారు.