Jagan: జగన్ ప్రచార సభలో అపశ్రుతి... కార్యకర్త పరిస్థితి విషమం

  • డెంకాడ సభలో కార్యకర్తలకు గాయాలు
  • ఆసుపత్రికి తరలింపు
  • జగన్ ప్రసంగిస్తుండగా ఘటన

వైఎస్సార్సీపీ, టీడీపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నాయి. ఈ తరుణంలో ఆదివారం విజయనగరం జిల్లాలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. డెంకాడలో జగన్ ను చూసేందుకు వచ్చిన నలుగురు యువకులు సమీపంలో ఉన్న మిద్దెపైకి ఎక్కారు. అయితే మిద్దె పైభాగంలో ఉన్న ఇటుకలు ఒక్కసారి వాళ్లపై పడడడంతో గాయాలపాలయ్యారు. జగన్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. పార్టీ కార్యకర్తలు పడిపోవడంతో నాయకులు హుటాహుటీన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News