YSRCP: వైఎస్సార్సీపీ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

  • కొత్తముఖాలకు చోటు
  • తొమ్మిది మందితో జాబితా
  • మీసం తిప్పిన మాజీ సీఐ గోరంట్లకు హిందూపురం టికెట్

వైఎస్సార్సీపీ లోక్ సభ ఎన్నికలకు గాను తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. శనివారం రాత్రి హైదరాబాద్ లో తొమ్మిది మందితో మొదటి విడత జాబితాను మీడియాకు వెల్లడించారు. ఈసారి కొన్ని కొత్త ముఖాలకు చోటిచ్చినట్టు స్పష్టమవుతోంది. అప్పట్లో జేసీ సోదరులపై మీసం తిప్పి సంచలనం సృష్టించిన మాజీ సీఐ గోరంట్ల మాధవ్ కు హిందూపురం లోక్ సభ టికెట్ ఇచ్చారు. కాగా, ఈ జాబితాలో 2 ఓసీ, 3 బీసీ, 3 ఎస్సీ, ఒక టికెట్ ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించారు. వీరిలో అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీలు. మిగిలిన ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఆదివారం ఇడుపులపాయలో ప్రకటించనున్నారు.

వైఎస్సార్సీపీ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా

అరకు- గొడ్డేటి మాధవి
అమలాపురం-అనురాధ చింతా
అనంతపురం-తలారి రంగయ్య
బాపట్ల- నందిగం సురేష్
కర్నూలు-  డాక్టర్ సంజీవ్ కుమార్
హిందూపురం-గోరంట్ల మాధవ్
కడప-అవినాష్ రెడ్డి
చిత్తూరు- నల్లకొండగారి రెడ్డప్ప
రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి

  • Loading...

More Telugu News