: సీఎం కిరణ్ తో సబిత భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సాయంత్రం భేటీ అయ్యారు. దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో సీబీఐ కోర్టు సబితకు సోమవారం సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె పదవిలో కొనసాగే విషయమై సాధ్యాసాధ్యాలు చర్చించడానికే ఈ భేటీ అని తెలుస్తోంది. సబిత దాల్మియా సిమెంట్స్ కేసులో జూన్ 7 సీబీఐ న్యాయస్థానం ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటులో ఆమెను ఎ4 నిందితురాలిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. వైఎస్ హయాంలో గనుల మంత్రిగా పనిచేసిన ఈ చేవెళ్ళ చెల్లెమ్మ.. దాల్మియా సిమెంట్స్ కు లబ్ది చేకూరేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్టు సీబీఐ తన ఛార్జిషీటులో ఆరోపించింది.