Chandrababu: తక్కువ టైమ్ ఇచ్చి దెబ్బకొట్టాలనుకున్నారు.. ఎలా ఉపయోగించుకుంటానో చూడండి!: చంద్రబాబు ధీమా
- ఇదో అవకాశంగా భావిస్తాను
- సన్నద్ధం కాలేనని భావిస్తున్నారు
- 11వ తేదీ ఎన్నికలకు కారణం అదే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓవైపు నవ్వులు విరబూయిస్తూ, మరోవైపు నిప్పులు కురిపిస్తూ ద్విపాత్రాభినయం చేశారని చెప్పాలి. ముఖ్యంగా జగన్, కేసీఆర్, మోదీ త్రయంపై మాత్రం ఒంటికాలిపై లేచారు. ఏప్రిల్ 11న ఎన్నికలు పెట్టడం వెనుక తనను దెబ్బతీసే కుట్ర దాగి ఉందని ఆరోపించారు చంద్రబాబు.
"నెలరోజుల సమయం మాత్రమే ఉండడంతో నేను ఎన్నికలకు సన్నద్ధం కాలేనని అనుకున్నారు. ఎన్నికలకు తక్కువ టైమ్ ఇచ్చి నన్ను దెబ్బకొట్టాలనుకున్నారు. కానీ ఇదో ఆపర్చునిటీగా భావిస్తాను. సకాలంలో ఎన్నికలకు సిద్ధం కాలేనన్న భావనతోనే ఏప్రిల్ 11వ తేదీని పోలింగ్ డేట్ గా నిర్ణయించారు. అది కూడా మంచిదే. ఇలాంటి సంక్షోభాన్ని ఓ అవకాశంగా మలుచుకుంటాను. విపత్తును గెలుపుగా మార్చుకుంటాను" అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.