: ప్రాణాలకు ముప్పుంది.. నేరుగా జైల్లో లొంగిపోతా: సంజయ్ దత్


ముంబయి పేలుళ్ళ కేసులో ఐదేళ్ళ జైలుశిక్షకు గురైన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నేరుగా యెరవాడ జైల్లో లొంగిపోతానని టాడా కోర్టుకు తెలిపాడు. ఛాందసవాద మూకల నుంచి తన ప్రాణాలకు ముప్పుందన్న కారణంతోనే జైల్లో లొంగిపోవాలని అనుకుంటున్నట్టు వెల్లడించాడు. అందుకు అనుమతించాలని తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానాన్ని కోరాడు. వాస్తవానికి సంజయ్ దత్ రేపు ముంబయిలోని ప్రత్యేక కోర్టులో లొంగిపోవాల్సి ఉంది.

1993లో ముంబయిలో చోటు చేసుకున్న పేలుళ్ళ కేసులో సంజయ్ దత్ కు టాడా కోర్టు ఆరేళ్ళ శిక్ష విధించగా.. కొంతకాలం రిమాండ్ ఖైదీగా ఉన్న సంజయ్ అనంతరం బెయిల్ పై బయటికొచ్చాడు. ఈ కేసుపై ఇటీవలే తుది తీర్పు వెలువరించిన సుప్రీం, ఈ బాలీవుడ్ హీరోకు ఐదేళ్ళ జైలుశిక్ష ఖరారు చేసింది. తన చిత్రాలు పూర్తి చేసేందుకు మరికొంత కాలం గడువివ్వాల్సిందిగా కోర్టుకు విన్నవించుకోగా, నాలుగు వారాల అదనపు సమయం కేటాయించింది. ఆ గడువు రేపటితో పూర్తవుతుంది.

  • Loading...

More Telugu News