Congress: ఇక పోటీ చేయలేను!: ఎన్నికలకు వీడ్కోలు పలికిన శరద్ పవార్
- 14 పర్యాయాలు ఎన్నికల్లో పోటీచేసిన మరాఠా యోధుడు
- కొత్తతరానికి అవకాశం
- కుమార్తె, మనవడు పోటీచేస్తారంటూ వెల్లడి
దేశ రాజకీయాల్లో శరద్ పవార్ ఓ దిగ్గజం అని చెప్పాలి. సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయన సొంతం. ఇప్పటివరకు పవార్ 14 పర్యాయాలు ఎన్నికల్లో పోటీచేశారు. 1967లో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మడమ తిప్పని నేతగా శరద్ పవార్ కు రాజకీయ వర్గాల్లో పేరుంది. ముఖ్యంగా రైతు పక్షపాతిగా ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటారు.
అయితే, ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడంలేదని, ఇకమీదట ఎన్నికలకు తాను దూరంగా ఉంటానని స్పష్టం చేశారు ఈ మరాఠా యోధుడు. తన కుటుంబం నుంచి కొత్త తరాన్ని ప్రోత్సహిస్తున్నానని, ఇంకా తాను పోటీ చేయాల్సిన అవసరం కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో తన కుమార్తె సుప్రియా సూలే, మనవడు పార్థ పవార్ ఎన్నికల బరిలో దిగుతున్నారని శరద్ పవార్ వెల్లడించారు. మొదట కాంగ్రెస్ వాదిగా గుర్తింపు తెచ్చుకున్న శరద్ పవార్ ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు.