: టీజీ వెకిలి చేష్టలు మానుకోవాలి: హరీశ్ రావు
రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ తెలంగాణ వ్యతిరేక వైఖరి విడనాడాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సలహా ఇచ్చారు. తెలంగాణ భవన్ లో నేడు హరీశ్ మీడియా సమావేశం నిర్వహించారు. మనసులో తెలంగాణపై ప్రతికూల భావనలు నింపుకున్న టీజీ వెకిలి చేష్టలు కట్టిపెట్టాలని సూచించారు. ఆయనలాంటి జోకర్ మంత్రి కావడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం అని వ్యాఖ్యానించారు. టీజీ ఎప్పుడు మాట్లాడినా కామెడీగా మాట్లాడతాడని, తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చుకోవడం మానాలని హరీశ్ రావు హితవు పలికారు.