India: ఇథియోపియా విమాన ప్రమాద మృతుల్లో నలుగురు భారతీయులు
- అడిస్ అబాబా నుంచి నైరోబి వెళుతున్న విమానం
- టేకాఫ్ తీసుకున్న 6 నిమిషాలకే ప్రమాదం
- విమానంలో మొత్తం 157 మంది
ఇథియోపియాలో ఆదివారం నాడు చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో నలుగురు భారతీయులు కూడా మృతి చెందినట్టు ఆలస్యంగా తెలిసింది. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నగరం నైరోబీకి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. విమానంలో మొత్తం 157 మంది ఉన్నారు. టేకాఫ్ తీసుకున్న 6 నిమిషాల్లోనే విమానం మైదాన ప్రాంతంలో కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన నలుగురు భారతీయుల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి భారత విదేశాంగ వర్గాలు సమాచార సేకరణలో నిమగ్నమయ్యాయి.