: హజారే జనజాగరణ్ యాత్ర ప్రారంభం
సామాజిక కార్యకర్త అన్నా హజారే జనజాగరణ్ యాత్రను ప్రారంభించారు. జనలోక్ పాల్ బిల్లుపై కేంద్రప్రభుత్వ వైఖరిపై హజారే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అవినీతిపై ప్రజలను జాగృతం చెయ్యాలన్న సంకల్పంతో హజారే జనజాగరణ్ యాత్ర ప్రారంభించారు. యాత్ర ప్రారంభించడానికి ముందు హరిద్వార్ లోని శాంతికుంజ్ ను సందర్శించారు. దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలోని మృత్యుంజయ ఆడిటోరియంలో హజారే మాట్లాడుతూ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఓ పార్టీ నుంచి మరో పార్టీకి అధికార బదలాయింపు వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని హజారే అభిప్రాయపడ్డారు.