Andhra Pradesh: తెలంగాణలో ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఆడుతున్న నాటకమే ‘డేటా చోరీ’: నటుడు శివాజీ

  • డేటా చౌర్యం చేసింది తెలంగాణ ప్రభుత్వం
  • కేసీఆర్ ని చూస్తే ఎందుకు భయపడాలి?
  • హైదరాబాద్ బ్రాండ్ వాల్యూను కేసీఆర్ చంపేశారు

తెలంగాణలో ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని, రాజకీయాలను పక్కదారి పట్టించేందుకు ఆడుతున్న నాటకమే ‘డేటా చోరీ’ అని ప్రముఖ నటుడు శివాజీ విమర్శించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అందుకే, ‘ఐటీ గ్రిడ్’ కేసును తెరపైకి తెచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. డేటా చౌర్యం చేసింది తెలంగాణ ప్రభుత్వం అని, కేసీఆర్ ని చూస్తే ఎందుకు భయపడాలి? అని ప్రశ్నించారు.హైదరాబాద్ బ్రాండ్ వాల్యూను కేసీఆర్ చంపేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా బీజేపీకి సంబంధించిన ‘నమో యాప్’ గురించి ఆయన ప్రస్తావించారు. అందులో, కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల డేటా ఉందని అన్నారు. 2018 ఆగస్టు 28న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీటింగ్ నిర్వహించారని, ఆ మీటింగ్ లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారని, కేంద్ర ప్రభుత్వ లబ్ధి దారుల వివరాలను పెన్ డ్రైవ్ లో తీసుకురావాలని ఆ సీఎంలను అమిత్ షా ఆదేశించారని శివాజీ ఆరోపించారు.

More Telugu News