Narendra Modi: నేను ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని చూస్తుంటే.. వాళ్లు నన్నే తొలగించాలని చూస్తున్నారు: మోదీ

  • కాంగ్రెస్ రైతుల సంగతే మరచిపోతుంది
  • వ్యతిరేకంగా మాట్లాడేవారిని క్షమించరు
  • కాంగ్రెస్ చేతిలో కుమారస్వామి రిమోట్
  • ఎన్నో ప్రాజెక్టులను అసంపూర్తిగా మిగిల్చింది  

నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రవేశ పెడితే వ్యతిరేకిస్తున్నారని.. రైతుల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారంటూ ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. నేడు కర్ణాటకలోని కలబురగిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల సంగతే మరచిపోతుందని.. అయితే తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని రైతులెన్నడూ క్షమించరని అన్నారు. కాంగ్రెస్ రైతుల పేరు చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని.. ఆ తరువాత వారిని అవమానించడమే కాకుండా.. వారిపై కేసులు కూడా బనాయించిన సందర్భాలున్నాయన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రిమోట్ కాంగ్రెస్ చేతిలో ఉందని.. ఆయన ఆ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. తాను ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని చూస్తుంటే.. విపక్షాలు తననే తొలగించేందుకు చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులను అసంపూర్తిగా మిగిల్చిందని.. తమ ప్రభుత్వం ఇప్పుడు వాటిని పూర్తి చేస్తోందని మోదీ తెలిపారు.

More Telugu News