jagan: జగన్ వల్ల ఎంతో మంది కేసుల్లో చిక్కుకుని, మానసిక క్షోభ అనుభవిస్తున్నారు: చంద్రబాబు
- తప్పులు చేయడం, శిక్షలు అనుభవించడం జగన్ కు అలవాటే
- నేరగాళ్లకే వైసీపీలో చోటు లభిస్తుంది
- వైసీపీలో ఉంటే ఎవరైనా తప్పులు చేయాల్సిందే
వైసీపీ అధినేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేయడం, శిక్షలు అనుభవించడం జగన్ కు అలవాటేనని అన్నారు. జగన్ వల్ల ఎందరో కేసుల్లో చిక్కుకున్నారని, మానసిక క్షోభను అనుభవిస్తున్నారని చెప్పారు. తప్పుడు పనులు చేసే వారికి, నేరగాళ్లకు వైసీపీలో చోటు లభిస్తుందని... వైసీపీలో ఉంటే ఎవరైనా తప్పులు చేయాల్సిందేనని అన్నారు. నేరాలు, ఘోరాలు చేసే ఆలోచనలు వైసీపీ చేస్తుందని... ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి టీడీపీ ఆలోచిస్తుందని చెప్పారు.