: మా దేశం రండి.. తడాఖా చూపిస్తాం: టీమిండియాకు స్టెయిన్ సవాల్
ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ భారత జట్టుకు సవాల్ విసురుతున్నాడు. ఈ ఏడాది చివర్లో టీమిండియా.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళనుండగా.. తమ దేశం వస్తే, తడాఖా చూపిస్తామని స్టెయిన్ ముందస్తు హెచ్చరికలు జారీ చేశాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ సఫారీ పేసర్ నేడు మీడియాతో ముచ్చటించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు టెస్టుల్లో ఉత్తమ ఆటతీరు కనబరుస్తోందన్న స్టెయిన్.. స్వంతగడ్డపై తమకు ఎదురులేదని ధీమా వ్యక్తం చేశాడు.
భారత్ లో లాగా దక్షిణాఫ్రికాలో ఫ్లాట్ పిచ్ లు ఉండవన్న ఈ వరల్డ్ నెంబర్ వన్ పేసర్.. అచ్చిరాని పిచ్ లపై టీమిండియా బ్యాట్స్ మెన్ కు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. భారత్ 2010లో సఫారీ గడ్డపై పర్యటించి మూడు టెస్టుల సిరీస్ ను 1-1తో డ్రా చేసుకున్నారు.