jamaal shah: ఈ పరిస్థితుల్లో యుద్ధం వస్తే... పాకిస్థాన్ పరిస్థితి ఘోరంగా ఉండేది: పాక్ నటుడు జమాల్ షా

  • అభినందన్ ను విడుదల చేయాలని పాకిస్థానీలంతా కోరుకున్నారు
  • పాక్ లో 70 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు
  • యుద్ధం వస్తే పేదరికం మరింత పెరుగుతుంది

పాకిస్థాన్ ఆర్మీకి చిక్కిన భారత పైలట్ అభినందన్ ఈరోజు మన దేశానికి తిరిగిరానున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ నటుడు, నిర్మాత జమాల్ షా మాట్లాడుతూ, అభినందన్ ను విడుదల చేయాలని భారతీయులతో సహా పాకిస్థానీలందరూ కోరుకున్నారని చెప్పారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థానంలో తాను ఉన్నా అదే చేసేవాడినని చెప్పారు. ప్రజల సెంటిమెంట్ ను గౌరవించి, అభినందన్ ను విడుదల చేయాలనే నిర్ణయాన్ని ఇమ్రాన్ తీసుకున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులో ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చి ఉంటే పాకిస్థాన్ పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యేదని చెప్పారు. పాక్ లో ఇప్పటికే 70 శాతం మంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారని తెలిపారు. యుద్ధం వస్తే పేదరికం మరింత పెరిగేదని అన్నారు.

More Telugu News