: 'రాయల్ చాలెంజర్స్'పై కేంద్రానికి ఫిర్యాదు


మద్యం వాణిజ్య ప్రకటనల లోగోలతో ఉన్న జెర్సీలను ధరిస్తున్నారంటూ ఓ స్వచ్ఛంద సేవా సంస్థ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఓ లేఖ రాసింది. ఢిల్లీకి చెందిన 'హృదయ్' సంస్థ.. బెంగళూరు ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆటగాళ్ళ దుస్తులపై ఉన్న జట్టు పేరు ప్రముఖ మద్యం బ్రాండు 'రాయల్ చాలెంజ్' ను సూచిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇలాంటి జెర్సీలను ఆటగాళ్ళే కాకుండా, కోచింగ్ సిబ్బంది, అంపైర్లు కూడా ధరిస్తున్నారని హృదయ్ సీనియర్ డైరక్టర్ మోనికా అరోరా తెలిపారు. అంతేగాకుండా, ఆ జెర్సీల కుడిభుజంపై వోడ్కా లోగో కూడా ఉందని, ఇలా నేరుగా మద్యానికి ప్రచారం చేయడం నేరమని ఆమె తమ లేఖలో పేర్కొన్నారు. రాయల్ చాలెంజర్స్ జట్టు మైదానంలోనే కాకుండా, ప్రచార కార్యక్రమాల సందర్భంగా నిర్వహించే మీడియా సమావేశాల్లోనే ఇవే తరహా దుస్తులతో హాజరవుతోందని అరోరా ఆరోపించారు.

1994 చట్టం ప్రకారం టెలివిజన్లలో మద్యం అమ్మకాలకు ఊతమిచ్చేలా ప్రచారం చేయడం నిబంధనలు ఉల్లంఘించడమే అని స్పష్టం చేశారు. తక్షణమే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చర్యలు తీసుకోవాలని సమాచార, ప్రసార శాఖను ఆరోరా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News