YSRCP: వైసీపీ ‘ఫ్యాన్’ స్విచ్ హైదరాబాద్ లో, ఫ్యూజ్ ఢిల్లీలో ఉంది: సీఎం చంద్రబాబు
- వైసీపీపై చంద్రబాబు విమర్శలు
- హైదరాబాద్ లో స్విచ్ వేస్తేనే ఇక్కడి ‘ఫ్యాన్’ తిరిగేది
- లేకపోతే ఆగిపోతుంది
వైసీపీ గుర్తు ‘ఫ్యాన్’, దీని స్విచ్ హైదరాబాద్ లో, ఫ్యూజ్ మాత్రం ఢిల్లీలో ఉందని సీఎం చంద్రబాబునాయుడు వ్యంగ్యంగా అన్నారు. ఏపీ రాష్ట్ర డీలర్ల ఆత్మీయ సదస్సును ఈరోజు విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, హైదరాబాద్ లో స్విచ్ వేస్తే వైసీపీ ‘ఫ్యాన్’ ఇక్కడ తిరుగుతుందని, లేకపోతే ఆగిపోతుందని విమర్శించారు. ఇలాంటి పార్టీలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. తెలంగాణలో అరవై సంవత్సరాల కష్టాన్ని వదులుకుని వచ్చామని, ఈరోజున ఇక్కడ కష్టపడుతుంటే మనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని వైసీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు.