: విశాఖ దగ్గర్లో మహాసేన్ తుపాను


బంగాళాఖాతంలో ఏర్పడిన మహాసేన్ తుపాను విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తుపాను గత 6 గంటలుగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది. ఇది ఈశాన్యంగా కదిలి బంగ్లాదేశ్ తీరం వద్ద చిట్టగాంగ్ సమీపంలో 16 వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వేటకు వెళ్ళే మత్స్యకారులు అటువైపు వెళ్ళవద్దని హెచ్చరించింది. విశాఖపట్టణం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో రెండోనెంబర్ ప్రమాదహెచ్చరికలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News