India: కళ్లకు 500 రంధ్రాలు.. స్మార్ట్ ఫోన్ ఎఫెక్ట్!

  • తైవాన్ మహిళకు అసాధారణ స్థితి
  • షాక్ తిన్న కంటి డాక్టర్
  • స్మార్ట్ ఫోన్ వాడకం పర్యవసానం

స్మార్ట్ ఫోన్ల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదేస్థాయిలో సమస్యలు కూడా ఉన్నాయి. సైబర్ మోసాలు కానివ్వండి, రేడియేషన్ సమస్య కానివ్వండి... స్మార్ట్ ఫోన్ కూడా కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది. అయితే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ బ్రైట్ నెస్ కూడా అనారోగ్యానికి కారణమవుతుందని తైవాన్ లో ఓ అరుదైన కేసు ద్వారా గుర్తించారు. పాతికేళ్ల చెన్ అనే మహిళ కొంతకాలంగా తీవ్రమైన కంటినొప్పితో ఆసుపత్రికి వెళ్లింది. ప్రాథమిక వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు కార్నియా టెస్ట్ చేసి షాక్ తిన్నారు.

ఆమె రెండు కళ్లలో కార్నియా అత్యంత తీవ్రస్థాయిలో దెబ్బతిన్నట్టు వైద్యపరీక్షల్లో తేలింది. రెండు కార్నియాల్లో దాదాపు 500 సూక్ష్మ రంధ్రాలు ఉన్నట్టు తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు వైద్యులు. అంతేకాకుండా, రెటీనా కూడా అదేస్థాయిలో డ్యామేజ్ అయినట్టు తెలుసుకున్నారు. అందుకు కారణం స్మార్ట్ ఫోన్ ను ఫుల్ బ్రైట్ నెస్ తో చూడడమేనని గుర్తించారు.

సాధారణంగా ఫోన్ బ్రైట్ నెస్ 300 ల్యూమెన్స్ మాత్రమే ఉండాలి. కానీ చెన్ ఉపయోగించిన ఫోన్ అంతకు రెట్టింపు స్థాయిలో బ్రైట్ నెస్ కలిగి ఉందట. అయితే అది ఏ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ అనే విషయం తెలియరాలేదు. మొత్తమ్మీద రెండేళ్లుగా ఆ ఫోన్ ను ఉపయోగిస్తోందట. భారత్ వంటి ఆసియా దేశాల్లో సైతం ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు బ్రైట్ నెస్ మీడియం రేంజ్ లో సెట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News