Visakhaptnam: విశాఖలో విషాదం: రసాయన ద్రవం తాగి నలుగురి మృతి.. ఆరుగురికి అస్వస్థత

  • గాజువాకలో విషాదం
  • మత్తుపదార్థంగా భావించి ద్రావణాన్ని తాగిన కాలనీ వాసులు
  • చికిత్స పొందుతూ నలుగురి మృతి

గుర్తు తెలియని ద్రవం తాగి నలుగురు మృతి చెందగా, మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. విశాఖపట్టణంలోని గాజువాక ఎస్టీ కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. పందుల పెంపకం వృత్తి ద్వారా జీవనం కొనసాగిస్తున్న కాలనీ వాసులు నేడు మత్తు పదార్థంగా భావించి ఓ సీసాలోని రసాయన ద్రవాన్ని తాగారు. దీంతో అసనాల రమణమ్మ(70), వాడపల్లి అప్పడు(65), కొండోడు(65), సండ్ర అప్పలమ్మ(60) చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. 

  • Loading...

More Telugu News