: బయ్యారంపై బహిరంగ విచారణకు సిద్దమా?: పొంగులేటి
బయ్యారంపై బహిరంగ విచారణకు సిద్దమా? అంటూ కేసీఆర్, బాబులకు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సవాలు విసిరారు. బయ్యారంపై ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ లబ్దికోసం పోటీపడుతున్నాయని ఆ రెండు పార్టీలపై ధ్వజమెత్తారు. బయ్యారంలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ప్రతిపక్షాలు కుట్రపన్ని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. విపక్షాలు ప్రైవేటు సంస్థలతో లాలూచీపడి అనవసర ఆందోళనలు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తరపున బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని తెలిపారు.