Chandrababu: జగన్ 'డ్రైవింగ్'పై చంద్రబాబు సెటైర్లు
- నన్ను డ్రైవర్ నెంబర్ వన్ అంటున్నారు
- జగన్ కు డ్రైవింగ్ ఇస్తే యాక్సిడెంటే
- చీరాల కార్యకర్తల సమావేశంలో సీఎం ఛలోక్తులు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శనివారం అనేక కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపారు. ముఖ్యంగా, చీరాల, బాపట్ల, రేపల్లె నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికలతో తలమునకలయ్యారు. చీరాల కార్యకర్తలతో సమావేశం అయిన సీఎం అక్కడి పరిస్థితులపై లోతుగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై వేసిన సెటైర్లు అందరిలో నవ్వులు పూయించాయి.
తనను ఆటోవాలాలందరూ డ్రైవర్ నంబర్ వన్ అంటున్నారని, రాష్ట్రాన్ని నడపగలిగే డ్రైవర్ చంద్రబాబేనంటున్నారని సంతోషం వ్యక్తం చేసిన సీఎం అక్కడినుంచి జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ ఏనాడూ డ్రైవింగ్ స్కూల్ కు పోలేదు కాబట్టి ఆయనకు డ్రైవింగ్ రాదని అన్నారు. డ్రైవింగ్ రానివాడికి వాహనం అప్పగిస్తే జరిగేది యాక్సిడెంటేనని ఎద్దేవా చేశారు. జగన్ కు రాష్ట్రాన్ని అప్పగిస్తే జరిగేవన్నీ ప్రమాదాలేనని వ్యాఖ్యానించారు. ఇక బాపట్ల కార్యకర్తలతో సమావేశం అయిన చంద్రబాబు ఎంపీ అభ్యర్థిగా మరోసారి మాల్యాద్రి పేరునే ఖరారు చేసినట్టు తెలుస్తోంది.