sarojadevi: సుబ్బరామిరెడ్డి చేతులమీదుగా బి. సరోజాదేవికి సత్కారం

  • అయిదు భాషల్లో అనేక చిత్రాలు
  • అగ్రకథానాయికగా ఎన్నో విజయాలు
  • అసమానమైన అభినయం ఆమె సొంతం

బి.సరోజాదేవి పేరు వినగానే చారడేసి కళ్లు .. అవి పలికే అద్భుతమైన హావభావాలు గుర్తొస్తాయి. అప్పట్లో కన్నడ యాసలో బి.సరోజాదేవి డైలాగ్స్ చెప్పిన విధానం కూడా ఆమెకి చాలామందిని అభిమానులను చేసింది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషాల్లో ఆమె అనేక చిత్రాలలో నటించారు. తెలుగులో ఆమె చేసిన 'శ్రీ కృష్ణార్జున యుద్ధం'.. 'పాండురంగ మహాత్మ్యం' .. 'ఆత్మబలం' .. 'మంచి - చెడు' .. 'దాగుడు మూతలు' .. 'భాగ్యచక్రం' సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

 అశేష ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న బి.సరోజాదేవికి, టి.ఎస్.ఆర్.లలితకళా పరిషత్ వారు ' విశ్వనట సామ్రాజ్ఞి' బిరుదుతో సత్కరించనున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త .. నిర్మాత .. రాజకీయ నాయకుడు .. డాక్టర్ టి. సుబ్బరామిరెడ్డి, 'మహాశివరాత్రి' పర్వదినాన (మార్చి 4) విశాఖ రామకృష్ణ బీచ్ లో బి. సరోజాదేవిని ఈ బిరుదుతో సత్కరించనున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. బి. సరోజాదేవికి జరిగే ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

More Telugu News