Jagan: కన్యత్వం వేలానికి పెట్టిన మోడల్ కు కళ్లు చెదిరే మొత్తం

  • వేలంలో రూ.18 కోట్లు ధర
  • సొంతం చేసుకున్న టోక్యో రాజకీయవేత్త
  • తీవ్రస్థాయిలో సాగిన వేలం ప్రక్రియ

పాశ్చాత్య దేశాల్లో శీలానికి విలువ ఇవ్వని సంఘటనలు చాలానే ఉన్నాయి. టీనేజ్ లోనే గర్భం దాల్చడం, పెళ్లికి ముందే సంసార సుఖం చవిచూడడం వంటి కార్యకలాపాలు కొన్ని దేశాల్లో సర్వసాధారణం. అదే సమయంలో కొన్ని పేద దేశాలకు చెందిన అమ్మాయిలు తమను తాము ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టుకోవాల్సి రావడం దారుణమైన విషయం. అజర్ బైజాన్ కు చెందిన మెహబూబా మహ్మద్ జాదా అనే 23 ఏళ్ల మోడల్ కూడా తన కన్యత్వాన్ని అంగట్లో సరుకులా అమ్మకానికి పెట్టింది. వరల్డ్ ఫేమస్ ఎస్కార్ట్ సైట్ సిండ్రెల్లాలో ఈ మేరకు ఓ ప్రకటన ఇచ్చింది. తాను స్వచ్ఛమైన కన్యనని, తనను పొందగోరే వాళ్లు వేలం ప్రక్రియలో పాల్గొనాలంటూ ఆ ప్రకటనలో పేర్కొంది మెహబూబా.

తన తల్లి ఇల్లు కూడా లేని దుర్భర పరిస్థితుల్లో ఉందని, ఆమె కోసం తాను కనీసం 90,000 పౌండ్లు అయినా సేకరించాలనుకుంటున్నానని తెలిపింది. ఆమె ప్రకటనకు అంతర్జాతీయ రసికుల నుంచి విశేష స్పందన వచ్చింది. దాంతో వేలం ప్రక్రియ ఊహించని విధంగా మిలియన్ పౌండ్లు దాటిపోయింది. చివరికి మెహబూబాను టోక్యోకు చెందిన ఓ రాజకీయ నాయకుడు ఎగరేసుకెళ్లాడు. ఆయన పేరును వెల్లడించడానికి వేలం సంస్థ అంగీకరించలేదు. అయితే, మెహబూబాను దక్కించుకోవడానికి ఆ జపనీస్ పొలిటీషియన్ భారత కరెన్సీలో రూ.18.56 కోట్లు చెల్లించాడు. ఇక వేలంలో మోడల్ భామను దక్కించుకోవడానికి పోటీపడిన వారిలో లండన్ కు చెందిన ప్రముఖ లాయర్, మ్యూనిచ్ ఫుట్ బాల్ క్లబ్ కు చెందిన ఆటగాడు కూడా ఉన్నారు.

ఇక ఈ వేలంలో విజేతగా నిలిచిన టోక్యో రాజకీయవేత్త ఈ కన్యకామణికి వైద్య పరీక్షలు చేయించి ఆమె నిజంగానే స్వచ్ఛమైనదని తేల్చుకున్న తర్వాత జర్మనీలోని ఓ హోటల్ లో ఇద్దరి సంగమానికి ఏర్పాట్లు చేస్తారట సిండ్రెల్లా ఎస్కార్ట్ కంపెనీవారు. జర్మనీలో ఇలాంటి అక్రమ 'సమావేశాలు' చట్టబద్ధం కావడంతో అక్కడైతే లీగల్ గా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని ముందే ప్లాన్ చేశారట! అన్నట్టు.. వేలంలో మెహబూబాకు అంతపెద్ద మొత్తం రావడానికి తాము కూడా కారణమంటూ సిండ్రెల్లా సంస్థ 20 పర్సెంట్ కమీషన్ నొక్కేసింది.

  • Loading...

More Telugu News