: అంతరిక్షంలో గీతాలాపన.. యూట్యూబ్ లో సూపర్ హిట్


మానవుడు అంతరిక్షంలోకి వెళ్ళడం ఓ అద్భుతం అనుకుంటే, ఆ శూన్యంలో భారరహిత స్థితిలో నడవడం నిజంగా మహాద్భుతం. ఇన్ని విశేషాల నడుమ విలక్షణంగా ఓ మ్యూజిక్ వీడియో చేస్తే అది నిస్సందేహంగా అపురూపమే. ఈ ఘనత కెనడా వ్యోమగామి క్రిస్ హాడ్ ఫీల్డ్ కి దక్కింది. ఇటీవలే హాడ్ ఫీల్డ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఓ పాట పాడి దాని వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశాడట. అక్కడ అది సూపర్ హిట్టయింది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే రెండు లక్షలమందికి పైగా వీక్షించారు.

ఐఎస్ఎస్ లో ఆరు నెలలు గడిపిన హాడ్ ఫీల్డ్ మంగళవారం భూమికి చేరుకోనున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సంగీత ప్రియుడు.. డేవిడ్ బోనీ హిట్ 'స్పేస్ ఆడిటీ' గీతాన్ని గిటార్ వాయిద్య సహితంగా పాడి రికార్డు చేశాడు.

  • Loading...

More Telugu News