Ramesh Kumar Padey: 1936లో కనిపించిన అరుదైన పాము.. మళ్లీ ఇన్నేళ్లకు కంటపడింది!

  • పెట్రోలింగ్‌కు వెళ్లిన అటవీ అధికారుల బృందం
  • రైలు పట్టాలపై రెడ్ కోరల్ కుక్రి గుర్తింపు
  • ఫోటో తీసిన బృందంలోని సభ్యుడు

82 ఏళ్ల తరువాత అరుదైన జాతి సర్పాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌లోని దుద్వా టైగర్‌ రిజర్వ్‌ అధికారులు గుర్తించారు. అరుదైన సర్ప జాతుల్లో ఒకటైన కోరల్ కుక్రి సోమవారం రాత్రి కనిపించినట్టు అధికారులు తెలిపారు. ఇది దుద్వాలోనే మొదట 1936లో కనిపించిందని.. మళ్లీ ఇన్నేళ్లకు కనిపించడం విశేషమన్నారు. ఖేరి ప్రాంతంలో మనుగడ సాగించడంతో ఈ సర్పాన్ని జంతుశాస్త్ర పరిభాషలో ‘ఆయిల్‌గోడాన్‌ ఖేరిన్‌సిస్‌’గా వ్యవహరిస్తారు.

ఈ సందర్భంగా డీటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ రమేష్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ‘‘దాదాపు 82 సంవత్సరాల తర్వాత దుద్వా అటవీ ప్రాంతంలో ఈ అరుదైన సర్పాన్ని గుర్తించాం. సోమవారం రాత్రి అటవీ అధికారుల బృందం దక్షిణ సోనారిపూర్‌ రేంజ్‌ అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్‌కు వెళ్లింది. సమీప రైల్వేస్టేషన్‌ వద్ద పట్టాలపై ఒక మీటరు పొడవున్న రెడ్ కోరల్‌ కుక్రిని గుర్తించారు. నారింజ రంగులో మెరిసి పోతూ కనిపించిన ఈ సర్పాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. వెంటనే బృందంలోని ఒకరు దాన్ని ఫొటో తీశారు’ అని తెలిపారు.

More Telugu News